నోటితోనే వాహనాల హారన్స్.. వైరల్ వీడియో ట్వీట్ చేసిన ఆనంద్ మహింద్రా

మిమిక్రీ, ఇమిటేషన్ చేసే ఆర్టిస్టులకు మన దేశంలో కొదవే లేదు. అయితే మనుషుల వాయిస్‌లను అనుకరించడం రొటీనే. కానీ, ఓ వ్యక్తి వెరైటీగా వాహనాల హారన్ తన గొంతుతో మోగిస్తున్నాడు. బస్ అంటే బస్, లారీ అంటే లారీ… ఇలా ఏ రకమైన వెహికల్ హారన్ అడిగితే దాన్ని అప్పటికప్పుడే తన గొంతులో నుంచి పలికిస్తున్నాడు.

ఈ స్పెషల్ టాలెంట్.. మహింద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహింద్రా కంట పడింది. వాట్సాప్ గ్రూపుల్లో హల్ చల్ చేస్తున్న ఆ వీడియో ఆయన వరకూ చేరింది. అంతే వెంటనే దాన్ని ట్విట్టర్లో పెట్టేశారాయన. భవిష్యత్తులో ట్రాన్స్‌పోర్ట్ వ్యవస్థ ఎలా ఉండబోతుందన్న దానిపై ఓ కాన్ఫరెన్స్‌లో చర్చిస్తుండగా ఈ వీడియో తన వాట్సాప్ గ్రూప్‌లోకి వచ్చిందని తన ట్వీట్‌లో తెలిపారు ఆనంద్ మహింద్రా. ప్రజలు రోజువారీ ట్రాన్స్‌పోర్టేషన్‌తో ఎంతగా మమేకమైపోయారన్నది ఈ వీడియో చూస్తే అర్థమైపోతుందని ఆయన అన్నారు. కలర్స్ టీవీ చానల్‌లో వచ్చే ‘ఇండియాస్ గాట్ టాలెంట్ (India’s Got Talent)’ షో ఈ వ్యక్తికి సరైన ప్లాట్‌ఫామ్ అని ట్వీట్ చేశారాయన.

Latest Updates