ఈ మసాజ్ తో అన్ని రోగాలు మటుమాయం

సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ ఆసక్తికరమైన పోస్టులను చేస్తుంటారు ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహింద్రా. ఇప్పటికే పలు విషయాలపై తన అభిప్రాయాలను వక్యం చేసి.. ముచ్చటైన కామెంట్ చేశారు. ప్రస్తుతం ఆయనకు ఓ ఫోటో కనపడింది. అది రోడ్ రోలర్ వీల్ పై బాడీ మసాజ్ గురించి పేపర్ యాడ్ ను అంటించారు. ఆ యాడ్ పై.. బాడీ మసాజ్ చేయించుకుంటే 400 రూపాయలు అని రాసి ఉంది. దీంతో ఆనంద్ మహింద్రా ఫన్నీ కామెంట్ చేశారు. ఈ రోడ్ రోలర్ తో బాడీ మసాజ్ చేయించుకుంటే మరోసారి చేయించుకునే అవసరమే లేదని, శరీరంలో ఉన్న అన్ని రోగాలు మాయమవుతాయని అన్నారు. ఈ పోస్టర్ ను అంటించిన వ్యక్తికి.. మంచి సెన్సాఫ్ హ్యూమర్ అయినా ఉండాలి లేదంటే ఐక్యూ లెవల్ అయినా తక్కువగా ఉండాలని ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఇది వైరల్ అవుతుంది. ఆనంద్ కు 70లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.

Latest Updates