టిక్ టాక్ స్టార్ పై అనసూయ ఆగ్రహం..జైల్లో పెట్టాలని కోరిన యాంకర్

టిక్ టాక్  స్టార్ పై యాంకర్ అనుసూయ ఆగ్రహం వ్యక్తం చేసింది. అనసూయతో పాటు పలువురు నెటిజన్లు సైతం టిక్ టాక్ అకౌంట్ ను బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

షాబాద్ ఖాన్ అనే యువకుడు టిక్ టాక్ వీడియోలతో బాగా పాపులర్ అయ్యాడు. ఎంతలా అంటే టిక్ టాక్ వీడియో పెడితే క్షణాల్లో వైరల్ అయ్యేంతలా. ఆ వీడియోల్లో ఏమైనా సోషల్ మెసేజ్ లు ఏమైనా ఉన్నాయంటే అదేం లేదు. అయినా సరే షాబాద్ ఖాన్ చేసిన టిక్ టాక్ వీడియోలు  యువతకు నచ్చుతున్నాయి. అతడిని ఏకంగా 11.8 మిలియన్ మంది ఫాలో అవుతున్నారు.

తాజాగా ఈ టిక్ స్టార్ చేసిన ఓ వీడియో నెటిజన్లకు కోపం తెప్పించింది. టిక్ టాక్ అకౌంట్ ను బ్లాక్ చేయాలని కోరుతున్నారు.

షాబాద్ ఖాన్  తన స్నేహితుడితో కలిసి వెళుతుంటారు. అలా వెళుతుండగా షాబాద్ ఖాన్ చేయి ఓ యువతికి తగులుతుంది. ఆయువతి అందుకు సీరియస్ అవుతుంది. సారీ చెప్పి ముందుకు వెళ్లిన ఈ టిక్ స్టార్  తన అరచేతిపై ఉమ్మి వేసి ఆ అమ్మాయి వద్దకు వెళ్లి సారీ చెబుతున్నట్లు నటించి, షేక్‌ హ్యాండ్‌ ఇస్తాడు. దీంతో అది ఆమెకు అంటుతుంది. అనంతరం హీరోలా అతడు తన స్నేహితుడితో కలిసి పోజులు కొడుతూ వెళ్లిపోయాడు. ఆ వీడియోపై నెటిజన్లు మండిపడుతున్నారు.

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో సోషల్ డిస్టెన్స్ పాటించాలని, ఒకరి చేతులు మరొకరికి తాకకూడదని ప్రభుత్వాలు సలహాఇస్తుంటే  షాబాద్ ఖాన్ ఇలాచేయడం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

నెటిజన్లకు మద్దతుగా యాంకర్ అనుసూయ స్పందించింది. ఎవరిని నిందించాలో నాకు తెలియడం లేదు.. ఇతడినా, ఇటువంటి వ్యక్తులను ఫాలో అవుతున్న వారినా.. ఇటువంటి వైరస్‌ లాంటి వ్యక్తులను ఏం చేయాలి? ఇటువంటి వారికి జైల్లో వేయాలి.. ఇతడి ఖాతాను తొలగించాలని  నేను టిక్‌టాక్‌ ఇండియాను కోరుతున్నాను’ అని అనసూయ ట్వీట్ చేసింది.

Latest Updates