సిద్దు పాకిస్తాన్ లో ఉండాల్సింది: జబర్దస్త్ యాంకర్ రష్మీ

పుల్వామా ఉగ్రదాడి విషయంలో పాకిస్తాన్ ను వెనకేసుకొచ్చిన పంజాబ్ మంత్రి సిద్దును యాంకర్ రష్మీ గౌతమ్ తీవ్రంగా విమర్శించింది. దేశ విభజన సంధర్భంగా సిద్దు పాక్ కు వెళ్లిపోయి ఉంటే బాగుండేదని.. అనుకోకుండా ఇక్కడే ఉండిపోయాడని ట్వీట్ చేసింది.

పాకిస్తాన్ జిందాబాద్ అంటూ కామెంట్ చేసిన షోహిబ్ హఫీజ్ అనే నెటిజన్ కు చుక్కలు చూపించింది యాంకర్ రష్మీ గౌతమ్. ‘నీ పాకిస్తాన్ గొప్పతనం ఏంట్రా? సాలే, మాతోనే అస్థిత్వం, లేకపోతే నువ్వు దానితో సమానం.. మూసుకుని కూర్చో.. దేశ వ్యతిరేక విధానం సిగ్గులేని చర్య..’ అని విరుచుకుపడింది రష్మీ.

పుల్వామా ఉగ్రదాడిలో 40మంది CRPF జవాన్లు అమరులైన విషయం పై సిద్దు పాక్ ను వెనుకేసుకొచ్చారు. దీంతో దేశ వ్యాప్తంగా ప్రజలు..  సిద్దు కామెంట్స్ పై మండిపడ్డారు. ప్రస్తుతం CRPF జవాన్లను దొంగ దెబ్బ కొట్టిన జైషే ఉగ్రవాదిని స్వతంత్ర్య సమరయోధునిగా పాకిస్తాన్ మీడియా కీర్తిస్తుంది.

పాకిస్తాన్ కు తగిన బుద్ది చెప్పేందుకు భారత్ రెడీ అయ్యింది. ఇందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని ప్రధాని మోడీ ఆర్మీకి చెప్పారు. దెబ్బకు దెబ్బ తీసేందుకు CRPF సిద్దమని తెలిపారు అధికారులు.

Latest Updates