ఉమెన్స్ డే రోజున యాంకర్ రష్మీ సెటైరికల్ ట్వీట్

మహిళా దినోత్సవం సందర్భంగా యాంకర్ రష్మీ చేసిన ట్వీట్.. సంచలనంగా మారింది. మార్చి 8 న ఉమెన్స్ డే  పురస్కరించుకొని..  శుభాకాంక్షలు చెప్పిన రష్మీ అదే ట్వీట్ లో సెటైర్లు కూడా వేసింది. ఆమె ఈ రోజు చేసిన తొలి ట్వీట్‌లో ‘మమ్మల్ని సూపర్‌ ఉమెన్‌ చేయడం ఆపండి’ అని ఓ ఫోటోను షేర్‌ చేసింది.

ఆ తర్వాత నిర్భయ తల్లి ఆశాదేవి గురించి మరో ట్వీట్‌ చేసింది. అందులో.. ‘ఓ మహిళ 8 ఏళ్ల నుంచి న్యాయం కోసం ఎదురుచూస్తున్న దేశంలో.. మనం మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం. హ్యాపీ ఉమెన్స్‌ డే’ అని ట్వీట్‌ చేసింది. ఆశాదేవి కన్నీరు పెడుతున్న ఫొటోను కూడా ఆ ట్వీట్ తో షేర్ చేసింది. ఈ ట్వీట్‌పై నెటిజన్లు పలు రకాలుగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

 

Latest Updates