కేసులొద్దు.. కోసెయ్యాలి : రేపిస్టులపై యాంకర్ రష్మి సీరియస్ కామెంట్

దేశంలో పలుచోట్ల జరుగుతున్న ఘాతుకాలపై తెలుగు టీవీ యాంకర్ రష్మిి సీరియస్ గా స్పందించింది. అత్యాచారం చేయాలనుకుంటున్నవారి మర్మాంగాలను కోసేయాలని ట్విట్టర్ లో స్పందించింది. బిహార్ లో జరిగిన ఓ దారుణ సంఘటన గురించి చెబుతూ…. ఆమె ఉద్వేగంగా స్పందించింది. దేశంలో అరాచకాలు, అత్యాచారాలు ఒకదాన్ని మించిన సంఘటన మరొకటి జరుగుతున్నాయని తెలిపింది. దేన్నయితే మగతనంగా ఫీలవుతున్నారో దాన్ని కట్ చేయాలని ఆమె కామెంట్ చేసింది. లేకపోతే…. స్త్రీ జాతిని మాయం చేస్తేనన్నా ఆడవారి ఉనికి ఏంటో వాళ్లకు అర్థం కాదు ఆమె సీరియస్ గా చెప్పింది.

బిహార్ లో ఏం జరిగిందంటే…

బిహార్ లోని భాగల్ పూర్ జిల్లాలో దారుణం జరిగింది. తల్లి, కూతురు ఉంటున్న ఓ ఇంట్లోకి ప్రవేశించారు నలుగురు వ్యక్తులు. తల్లి తలకు గన్ ను గురి పెట్టి… ఆమె కూతురుపై సామూహిక అత్యాచారానికి ప్రయత్నించారు. ఐతే… దుండగుల ప్రయత్నాన్ని ఆ యువతి అడ్డుకుంది. కోపంతో రగిలిపోయిన ఆ యువకులు… ఆమెపై ఒళ్లంతా యాసిడ్ పోశారు. యాసిడ్ తో స్నానం చేయించినంత దారుణానికి ఒడిగట్టారు. ఆ తర్వాత అక్కడినుంచి పారిపోయారు. యాసిడ్ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆ యువతి హాస్పిటల్ లో కొట్టుమిట్టాడుతోంది. పోలీసులు ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు.

Latest Updates