జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ కేటీఆర్‌ని కలిసిన యాంకర్ సుమ

తెలుగు టెలివిజన్ రంగంలో యాంకర్ సుమ తెలియని వారుండరు. ఆమె గత కొన్నేండ్ల నుంచి తెలుగు టెలివిజన్ రంగంలో యాంకరింగ్ చేస్తూ కోట్లాది మంది ప్రజల మనసులో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఎన్నో షోలకు వాఖ్యాతగా వ్యవహరిస్తూ బిజీగా ఉండే సుమ.. తాజాగా తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ను కలిశారు. ఆయన ప్రసంగం ఎంతో హుందాగా, ఆకట్టుకొనేలా ఉంటుందని యాంకర్‌ సుమ కేటీఆర్‌ని ప్రశంసించారు. ‘మీతో మాట్లాడటం చాలా ఆనందంగా ఉంది. నేను నా షోల్లో నాన్‌స్టాప్‌గా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటా. కానీ నాయకత్వ హోదాలో మీరు మీట్లాడే విధానం వినడానికి ఎంతో విలువైనదిగా ఉంటుంది. స్పష్టంగా మాట్లాడటం, మీరిచ్చే కమిట్‌మెంట్, మీరు చేసే సేవ అద్భుతం’ అని ఆమె ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌కు జతగా ఆమె కేటీఆర్‌ని కలిసిన ఫోటోను జత చేశారు. సుమ ట్వీట్‌కు మంత్రి కేటీఆర్‌ రీట్వీట్‌ చేశారు. ‘సుమతో మాట్లాడటాన్ని ఎంతో ఆస్వాదించాను. మా సంభాషణలను చూసిన ప్రజలు కూడా ఎంతో సంతోషపడతారు’ అని పేర్కొన్నారు.

For More News..

లిస్టులో తల్లి పేరు.. బీ ఫారంలో భార్య పేరు

చేతిలో రూపాయి లేకుండా కార్పొరేటర్ బరిలోకి

ప్రచారానికి పోతే రూ.1000, బిర్యానీ ప్యాకెట్

Latest Updates