వేణుమాధవ్‌ని చూసి కన్నీళ్లు పెట్టుకున్న ఉదయభాను

“సొంత చెల్లెలిని ఎలా రక్షిస్తాడో.. అలా నాతో మెలిగే వాడు. వేణన్న లేడన్న వార్త ఊహించుకోలేకపోతున్నా”అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు సినీ నటీ, టీవీ హోస్ట్ ఉదయభాను.

ఈ ఉదయం ఫిలించాంబర్ లో వేణుమాధవ్ కు నివాళులు అర్పించిన తర్వాత… వేణుమాధవ్ తో జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు ఉదయభాను. “వేణుమాధవ్ అన్న తన చుట్టూ ఉండే పరిసరాలను ఆనందంగా మార్చేస్తాడు. ఎవరికైనా ఏమైనా అయిందంటే వెంటనే స్పందిస్తాడు.. బంగారం లాంటి మనిషి ఆయన. ఆయనకోసం రచయితలు రాసే పాత్రలు అన్నీ ఇపుడు చిన్నబోతున్నాయి. ఆరోగ్యం జాగ్రత్త అని చాలాకాలంగా మేం చెబుతూనే ఉన్నాం. ఇంతలోనే ఇలా సడెన్ గా ఆయన మృతిచెందడం బాధ కలిగిస్తోంది. ఇండస్ట్రీకి ఆయన లేని లోటు ఎవరూ పూడ్చలేనిది.” అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు ఉదయభాను.

ఉదయభాను, వేణుమాధవ్ గతంలో… కలిసి వన్ మోర్ ప్లీజ్ అనే టీవీ ఛానెల్ ప్రోగ్రామ్ ను హోస్ట్ చేశారు. అప్పట్లో ఆ షో సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.

Latest Updates