చార్మినార్ సమీపంలో కూలిన పురాతన ఇళ్లు

హైదరాబాద్: కుండపోతగా కురుస్తున్న భారీ వర్షాలు.. వరదల దెబ్బకు పాత ఇళ్లు కూలిపోతున్నాయి. కొద్దిసేపటి క్రితం పాతబస్తీ చార్మినార్ సమీపంలో ఓ పురాతన ఇళ్లు కూలిపోయింది. వర్షం వెలియడంతో జనం బయటకు వస్తున్న సమయంలో ఈ భవనం పెద్ద శబ్దం చేస్తూ ఒక్కసారిగా ఒరిగిపోయింది. ఈ భవనం కింద పార్కు చేసి ఉన్న ఒక కారు బాగా దెబ్బతినింది. అలాగే క్రింద ఉన్న దుకాణం కూడా ధ్వంసమైంది. అదృష్టవశాత్తు ప్రాణనష్టం తప్పిపోయింది. బిల్డింగ్ కుప్పకూలడం గమనించిన చుట్టుపక్కల వారు వెంటనే అప్రమత్తమయ్యారు. ఫైర్ సిబ్బందికి.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎలాంటి ప్రాణ నష్టం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

 

Latest Updates