ఆ సూపర్ హిట్ మూవీ నానీకి నచ్చిందా..?

రీమేకుల పర్వం వేగం పుంజుకుంది. తమిళ సినిమాలు తెలుగులోకి, తెలుగులోవి హిందీలోకి అంటూ వరుసపెట్టి ఒకరి సినిమాలను మరొకరు తీసేస్తున్నారు. ప్రస్తుతం నాని చూపు కూడా రీమేక్‌‌ వైపు పడినట్లు తెలుస్తోంది. ‘జెర్సీ’తో విమర్శకుల ప్రశంసలు కొట్టేసిన నాని త్వరలో తన గ్యాంగ్‌‌తో కలిసి రానున్నాడు. మరోపక్క ఇంద్రగంటి మోహన కృష్ణ మూవీ ‘వి’లో నెగిటివ్ షేడ్స్‌‌ ఉన్న పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడు. ఆ తర్వాత అతడు ఒక రీమేక్ మూవీ చేయనున్నట్లు ఉప్పందింది. బాలీవుడ్‌‌లో సూపర్‌‌‌‌ హిట్ కొట్టిన ‘అంధాధున్’ని అటు తమిళంలో ప్రశాంత్‌‌తో తీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

తెలుగులో నానితో తీయనున్నారట. ఆల్రెడీ నాని ఓకే అన్నాడని సమాచారం. చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయాన్ని సాధించింది ‘అంధాధున్’. కేవలం ముప్ఫై రెండు కోట్లతో తీస్తే, ప్రపంచవ్యాప్తంగా నాలుగొందల నలభై కోట్లకి పైగా రాబట్టింది. అంధుడిగా ఆయుష్మాన్ నటనకు జాతీయ అవార్డు వచ్చింది. అలాంటి పాత్రను పోషించాలంటే మంచి పర్‌‌‌‌ఫార్మర్ అయ్యుండాలి. నాని టాలెంట్‌‌ గురించి తెలియనిదేముంది! ఏ పాత్రనైనా అదరగొట్టేస్తాడు. కాబట్టి అతడు ఈ రోల్‌‌కి పర్‌‌‌‌ఫెక్ట్ చాయిస్. కానీ అతడికి ఈ ఆఫర్ నిజంగా నచ్చిందా, ఓకే అన్నాడా లేదా అనేదే డౌట్. కన్‌‌ఫర్మ్ అయితే అధికారికంగా ప్రకటిస్తారు కదా.. వెయిట్ చేద్దాం.

Latest Updates