ఆంధ్రా ఉద్యోగులు గో బ్యాక్

ఆంధ్రా ఉద్యోగులు గో బ్యాక్
విద్యుత్ సౌధలో ఉద్యోగుల నిరసనలు

సోమాజిగూడ వెలుగు: ఆంధ్రప్రదేశ్ రిలీవ్ చేసిన విద్యుత్ ఉద్యోగులను తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో చేరనిచ్చేది లేదంటూ విద్యుత్ ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశాయి. జస్టిస్ ధర్మాధికారి ఇటీవల ఇచ్చిన రిపోర్ట్ కు వక్రబాష్యం చెబుతూ 568 మంది ఆంధ్రా ఉద్యోగులను తెలంగాణ పై రుద్దేందుకు ప్రయత్నిస్తున్నారని వారు విమర్శించారు. ఆంధ్రాలో రిలీవ్ అయిన ఉద్యోగులు ఇక్కడ చేరకుండా అడ్డుకున్నారు. మంగళవారం విద్యుత్ సౌధ వద్ద తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు.

ఏ రాష్ట్ర ఉద్యోగులు ఆ రాష్ట్రంలోనే పనిచెయ్యాలని ఒక్క ఆంధ్రా ఉద్యోగిని చేర్చుకోమంటూ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ నేతలు శివాజీ, రవి లు మాట్లాడుతూ  ఆంధ్రా ఉద్యోగులు తెలంగాణకు రావద్దని సూచించారు. రాష్ట్రానికి చెందిన ఒక్క ఉద్యోగాన్ని కూడా వదులుకునేది లేదని తేల్చిచెప్పారు. ఆంధ్ర ఉద్యోగులు గో బ్యాక్…లవ్ యువర్ స్టేట్, లీవ్ అవర్ స్టేట్  అంటూ నినాదాలు చేశారు. ఈ నెలఖారు వరకు రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తామన్నారు.

See Alos: ఫీల్డ్​ అసిస్టెంట్లపై ప్రభుత్వం కఠిన నిర్ణయం

రైతు రుణమాఫీ: అర్హులను ఇలా గుర్తిస్తారు

ఇంటర్​ క్వశ్చన్ ​పేపర్లలో తప్పులే తప్పుల

 నిజామాబాద్ ఎమ్మెల్సీ బరిలో కవిత

Latest Updates