పడవల ద్వారా తమిళనాడు నుంచి ఏపీకి 90 మంది

దేశవ్యాప్తంగా లాక్డౌన్ ను కఠినంగా అమలుచేస్తుండటంతో వాహనాలు లేక ఎక్కడివాళ్లు అక్కడే చిక్కుకుపోయారు. దాంతో ఎలాగైనా తమ స్వస్థలాలకు చేరుకోవాలని వివిధ మార్గాల్లో ప్రయత్నిస్తున్నారు. అలా ఆలోచించి ఏపీకి చెందిన 90 మంది పడవల ద్వారా తమిళనాడు నుంచి ఏపీకి చేరుకున్నారు.

ఏపీకి చెందిన 90మంది నాలుగు పడవల ద్వారా తమిళనాడు నుంచి ఏపీలోని నాగాయలంక మండలంలోని ఎదురుమొండి గ్రామానికి సోమవారం చేరుకున్నారు. అయితే కరోనా వ్యాప్తి దృష్ట్యా సదరు గ్రామస్థులు పడవల్లో వచ్చిన వారిని అడ్డుకున్నారు. దాంతో తాము శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారమని.. లాక్డౌన్ వల్ల తమిళనాడులో చిక్కుకుపోయామని గ్రామస్థులకు తెలిపారు. వారంతా పడవల ద్వారా బే ఆఫ్ బెంగాల్ గుండా ఏపీకి చేరుకున్నారు.

ఎవరైనా ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వస్తే కరోనా నియంత్రణ దృష్ట్యా వారిని 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉంచుతున్నారు. అందువల్ల ఎదురుమొండి గ్రామ ప్రజలు తమిళనాడు నుండి పడవలలో 90 మంది వచ్చిన విషయాన్ని స్థానిక అధికారులకు తెలిపారు.

For More News..

దేశచరిత్రలోనే కొత్త పథకం.. నేడు ఏపీలో ప్రారంభం

సెప్టెంబర్ లేదా అక్టోబర్ నాటికి కరోనాకు మందు

లాక్డౌన్ ఎఫెక్ట్: చెక్క పడవలో 1100 కిలోమీటర్ల ప్రయాణం

Latest Updates