మండలి రద్దుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం

ఏపీ శాసన మండలి రద్దు చేస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ప్రవేశపెట్టిన తీర్మానానికి శాసనసభ ఆమోదం తెలిపింది. మండలిని రద్దు చేస్తూ సోమవారం జగన్ తీర్మానం ప్రవేశ పెట్టారు. మండలి రద్దు తీర్మానంపై స్పీకర్ తమ్మినేని సీతారాం డివిజన్ పద్దతిలో ఓటింగ్ నిర్వహించగా…  133 మంది సభ్యులు మండలి రద్దు తీర్మానానికి మద్దతుగా ఓటు వేశారు. మెజార్టీ సభ్యులు మద్దతు తెలపడంతో మండలి రద్దు తీర్మానానికి శాసనసభ ఆమోదం తెలిపినట్టు స్పీకర్ ప్రకటించారు. మూడింట రెండొంతులకు పైగా మెజార్టీతో సభ ఆమోదం తెలిపడంతో మండలి రద్దు తీర్మానం శాసన సభ ఆమోదం పొందినట్టు స్పీకర్ ప్రకటించారు. అనంతరం సభను నివరవధికంగా వాయిదా వేశారు.

Latest Updates