100 రూపాయలకు నాలుగు రకాల పండ్లు

లాక్ డౌన్ కొనసాగుతుండటంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పండ్ల రైతులు నష్టపోకుండా..ప్రజలకు తక్కువ ధరకే పండ్లు దొరికేలా చర్యలు చేపట్టింది. కేవలం 100 రూపాయలకే నాలుగు రకాల పండ్లను పంపిణీ చేయాలని నిర్ణయించింది. రైతు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో ఈ పండ్లను పంపిణీ చేయనుంది. దీనికి సంబంధించి రైతుల దగ్గర నుంచి నేరుగా వినియోగదారులకు పండ్లు సరఫరా అయ్యేలా చర్యలు చేపట్టింది ఏపీ సర్కారు.

Latest Updates