‘కనెక్ట్ టు ఆంధ్ర’ కు మంగళగిరి ఎమ్మెల్యే ఐదేళ్ల జీతం

ఆంధ్ర ప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘కనెక్ట్ టు ఆంధ్రా’ ఇచ్చిన పిలుపు మేరకు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి స్పందించారు. ఇందుకు గాను తన ఐదేళ్ల ఎమ్మెల్యే జీతాన్ని రాష్ట్ర అభివృద్ధికి ఇచ్చారు. తన   జీతాన్ని ప్రభుత్వానికి అందజేయాలని అసెంబ్లీ కార్యదర్శికి లేఖ అందజేశారు రామకృష్ణా రెడ్డి. జగన్ తలపెట్టిన అమ్మ ఒడి, నాడు-నేడు, నవరత్నాల పథకంలో ఎన్ఆర్ఐ లను, ప్రజలను భాగస్వామ్మమవ్వాలని కోరారు. ఇందుకు గాను.. ‘కనక్ట్ టు ఆంధ్ర’ వెబ్ పోర్టల్ ను ప్రారంభించారు జగన్.దీనికి చైర్మెన్ గా జగన్, వైస్ చైర్మెన్ గా సీఎస్ ఉన్నారు.

Latest Updates