టీడీపీ లీడర్ రాజేంద్రప్రసాద్‌కు ఎమ్మెల్యే వంశీ క్షమాపణ

విజయవాడ: టీడీపీ నేత రాజేంద్ర ప్రసాద్ కు క్షమాపణలు చెప్పారు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలను బట్టే తాను అలా మాట్లాడవలసివచ్చిందని అన్నారు. వంశీ మీడియాతో మాట్లాడుతూ… తనకు రాజకీయ భిక్ష పెట్టింది చంద్రబాబేనని.. అలా అని చంద్రబాబుకు కూడా కాంగ్రెస్‌ రాజకీయ భిక్ష పెట్టిందని.. ఆయన కూడా కాంగ్రెస్‌లోనే ఉన్నారా అని ప్రశ్నించారు.

తన ఒక్కడి విషయంలోనే నైతిక విలువలు బాబుకు కనిపించాయా అని ప్రశ్నించారు వంశీ. చంద్రబాబు తన తండ్రి లాంటి వారని ఆయన కాళ్లకు దండం పెడితే తప్పేంటని అన్నారు…  అలా అని కాళ్లు పట్టుకోలేదని రెండింటికి తేడా ఉందని వంశీ చెప్పారు. తన వ్యక్తిగత పనులకు చంద్ర బాబు కోట్ల రూపాయలు ఇవ్వలేదని… ఎన్నికలప్పుడు ఏ పార్టీ అయినా ఫండ్ ఇస్తుందని చెప్పారు. 2014 ఎన్నికలలో ఆ ఫండ్ కూడా ఇవ్వలేదని… తాను మనీ తీసుకున్నానని రాజేంద్రప్రసాద్‌ అనే సరికి బాధపడ్డానని వంశీ చెప్పారు.

Latest Updates