ఏపీలో క‌రోనావిల‌యం.. 24 గంట‌ల్లో 97 మంది మృతి

అమ‌రావ‌తి: గురువారంతో పోలిస్తే ఏపీలో కరోనా వైరస్ కేసుల సంఖ్య కాస్త తగ్గింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 8943 కరోనా పాజిటివ్ కేసులు నమోద‌య్యాయి. అయితే మ‌ర‌ణాల సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 97 మంది కరోనా కారణంగా చనిపోయినట్టు ఏపీ ప్రభుత్వం హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 2475కి చేరింది. ఈ రోజు నమోదైన 8943 కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,73,085కి పెరిగింది. రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,70,924 కాగా, రాష్ట్రంలో ప్రస్తుతం 90,840 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 55,692 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్టు ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 27.05 లక్షల మందికి కరోనా పరీక్షలు చేశారు.

 

 

 

Latest Updates