ఏపీలో గ‌డిచిన 24గంట‌ల్లో 10,175 కేసులు న‌మోదు

ఏపీలో గ‌డిచిన 24 గంట‌ల్లో 10,175 కేసులు న‌మోద‌య్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 5,37,687కు చేరింది. కొత్తగా 68 మంది క‌రోనాతో మరణించగా.. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,702 చేరింది. 10,040 మంది క‌రోనా నుంచి రిక‌వ‌రీ అయ్యార‌ని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుద‌ల చేసింది. ఇక ఏపీలో క‌రోనా సోకి 4,35,647 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 97,338 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కరోనా కారణంగా చిత్తూరు-9, కడప-9, అనంత‌పురం-6 నెల్లూరు-9, ప్రకాశం-7, గుంటూరు-2, కృష్ణా-7,తూర్పు గోదావరి-5,పశ్చిమగోదావరి-5,శ్రీకాకుళం-4,కర్నూల్-5, విశాఖ-4, విజయనగరం-1 మ‌ర‌ణించారు.

Latest Updates