వ్యాపారుల నిర్లక్ష్యం : పాల ప్యాకెట్ లో పాముపిల్ల

ఏపీ : ఇన్ని రోజులు నకిలి పధార్థాలతో ప్రజల్లో కల్తీ భయం ఉండేది. దీంతో ఏం తినాలన్నా ప్రజలు భయపడుతుండగా..ఇప్పుడు వ్యాపారుల నిర్లక్ష్యం కస్టమర్లకు మరింత భయాందోళనకు గురి చేస్తుంది. పాల ప్యాకెట్ లో ఎక్కువ వాటర్ కలిపితే ఫర్వాలేదు. కానీ అదే మిల్క్ ప్యాకెట్ లో ఏకంగా పాము పిల్ల వచ్చింది. కస్టమర్ ఇది చూసి ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. ఈ సంఘటన ఏపీలో జరిగింది.

వివరాల్లోకి వెళితే పశ్చిమగోదావరి, కొవ్వూరు మండలం పశివేదల గ్రామానికి చెందిన ఆళ్ల రంగనాథ్‌ రోజూ ఓ కంపెనీకి చెందిన పాలప్యాకెట్‌ ను కొనుగోలు చేసి వాడుతుంటారు. గురువారం గ్రామంలోని షాపులో ఓ ప్యాకెట్‌ కొనుగోలు చేసి పాలను కాయడానికి ఓపెన్‌ చేసి గిన్నెలో వేస్తుండగా.. అందులో నుంచి పాము పిల్ల బయటపడింది. దీంతో వారు ఆందోళన చెంది షాపు అతడిని సంప్రదించగా వారు ఏ విధమైన సమాధానం చెప్పలేదు. వెంటనే అతడు వినియోగదారుల ఫారంను ఆశ్రయించనున్నట్టు తెలిపాడు. పాల ప్యాకెట్ల కంపెనీపై తగు చర్యలు తీసుకుంటామని వినియోగదారుల ఫారం తెలిపినట్లు చెప్పాడు రంగనాథ్.

Latest Updates