‘సంగమేశ్వరం’పై ఏపీ కొత్త స్కెచ్

సాయం చేయాలంటూ 4 నెలల కిందటే నీతి ఆయోగ్కు లెటర్
రూ.35,463 కోట్లతో అనేక ప్రాజెక్టులు కడుతున్నామని వెల్లడి
జలశక్తి శాఖ అభిప్రాయం కోరిన నీతిఆయోగ్
ఏపీ కుయుక్తులపై నోరు మెదపని తెలంగాణ సర్కార్

హైదరాబాద్, వెలుగు: శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటిని అక్రమంగా రాయలసీమకు మళ్లించే సంగమేశ్వరం(రాయలసీమ) లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించి ఏపీ సర్కారు అడ్వాన్స్ గానే స్కెచ్ వేసింది. ఈ ప్రాజెక్టుకు ఆర్థికసాయం చేయాలని కోరుతూ నాలుగు నెలల కిందటే నీతిఆయోగ్ కు లెటర్ రాసింది. సీమలో కరువు తీర్చేందుకు చేపడుతున్న ఈ ప్రాజెక్టుకు ఏపీ రీఆర్గనైజషన్ యాక్ట్ ప్రకారం కేంద్రం చేయూత అందించాలని కోరింది. నీతిఅయోగ్ కు లెటర్ రాయటంతోపాటు.. సంగమేశ్వరం, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ పనులకు అడ్మినిస్ట్రేటివ్ సాంక్షన్ ఇచ్చే జీవోలు జారీ చేసింది. ఏపీ ఫైనాన్స్ మినిస్టర్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మార్చి 2న నీతిఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్‌‌‌‌కు లెటర్ రాశారు. రూ.35,463 కోట్లతో రాయలసీమ డ్రాట్ మిటిగేషన్ స్కీం చేపడుతున్నట్లు తెలిపారు. అందులోనే లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను ప్రస్తావించారు. ఏపీ లేఖపై అభిప్రాయం చెప్పాలని నీతిఆయోగ్ కేంద్ర జలశక్తి శాఖను కోరడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ను డబుల్ చేయటంతో పాటు సంగమేశ్వరం లిఫ్ట్ పనులను రాచమార్గంలో పూర్తి చేసుకునేందుకు ఏపీ పక్కాగా ప్లాన్ చేసిందని లెటర్ ద్వారా అర్థమవుతోంది.

అందుకే డ్రాట్ మిటిగేషన్ స్కీం
తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఎదుర్కొంటున్న రాయలసీమ జిల్లాలకు తాగు, సాగునీటిని అందించడానికి రాయలసీమ డ్రాట్ మిటిగేషన్ స్కీం(ఆర్డీఎంర్డీఎస్)ను ప్రారంభించామని బుగ్గన తెలిపారు. ఈ స్కీంలో భాగంగా అనేక ప్రాజెక్టులు చేపడుతున్నామని, సంగమేశ్వరం లిఫ్ట్ స్కీం చేపట్టడంతోపాటు
ఇప్పటికే ఉన్న కాలువల క్యారీయింగ్ కెపాసిటీని పెంచబోతున్నామని వివరించారు. కొత్తగా రిజర్వాయర్లు నిర్మిస్తామని, ఇప్పటికే వివిధ ప్రాజెక్టుల కింద ఉన్న ఆయకట్టును ఈ ప్రాజెక్టులతో స్టెబిలై జ్ చేస్తామన్నారు. కృష్ణానదిలో భారీ వరదలు వచ్చి అన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీళ్లు సముద్రంలోకి పోతున్న 30 నుంచి 40 రోజుల్లోనే ఈ పథకాల ద్వారా నీటిని మళ్లిస్తామని తెలిపారు. సంగమేశ్వరంతోపాటు పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యు లేటర్ కెపాసిటీని 44 వేల క్యూసెక్కుల నుంచి 80 వేల క్యూసెక్కులకు పెంచుతామని, ఈ ప్రవాహం సులువుగా వెళ్లేందుకు కాలువల సామర్థ్యాన్ని పెంచుతామని చెప్పారు. ఆర్డీఎంఎర్డీ స్‌‌‌‌లో భాగంగా చేపట్టబోయే ప్రాజెక్టుల నిర్మాణానికి రూ.35,463 కోట్ల ఖర్చవుతుందని.. రిజర్వాయర్లు, కాలువల విస్తరణ, ఇతర సివిల్ పనులకు రూ.19,133 కోట్లు, పంపు హౌస్ లు, మోటార్లు, పంపులు తదితర ఎలక్ట్రో-మెకానికల్ పనులకు రూ.11,459 కోట్లు, భూ సేకరణ, నిర్వాసితులకు పరిహారం, ఆర్ అండ్ ఆర్ కు రూ.4,871 కోట్లుఖర్చవుతాయని వివరించారు. ప్రాజెక్టు పూర్తయితే రాయలసీమ ప్రజల సామాజిక, ఆర్థిక స్థితిగతుల్లో మంచి మార్పుంటుందని తెలిపారు. దేశంలోని ఇతర వెనకబడిన, కరువు పీడిత ప్రాంతాల అభివృద్ధికి ఈ ప్రాజెక్టు మోడల్‌‌‌‌గా నిలుస్తుందని పేర్కొన్నారు.

వేగంగా ఏపీ అడుగులు
సంగమేశ్వరం, పోతిరెడ్డిపాడు టెండర్ల ప్రక్రియకు గ్రీన్ ట్రిబ్యునల్ ఓకే చెప్పడంతో ఏపీ ప్రభుత్వం టెండర్లు పిలిచేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే కాలువల కెపాసిటీ పెంపు పనులకు అనుమతులివ్వగా ఒకటి, రెండు రోజుల్లో మిగతా పనులకూ టెండర్లు పిలిచేందుకు పర్మిషన్ ఇవ్వనుంది. అక్రమ ప్రాజెక్టులపై ఏపీ ఇంత స్పీడ్ గా రియాక్ట్ అవుతుంటే తెలంగాణకు నష్టం చేకూర్చేఈప్రాజెక్టులను అడ్డుకోవడానికి మన సర్కారు మాత్రం ప్రయత్నించడంలేదనే విమర్శలు వస్తున్నాయి.

ఎగువ రాష్ట్రాల్లో అక్రమ ప్రాజెక్టులు కట్టారు
ఏపీలో 41 శాతం భూభాగం కలిగిన రాయలసీమ జిల్లాల్లో సాగు భూమి 36 శాతమే ఉందని, అందులోనూ 20 శాతం భూమికే సాగునీటి సౌకర్యం ఉందని లేఖలో బుగ్గన పేర్కొన్నారు. తక్కువ వర్షపాతం, కృష్ణాలో తగ్గిన ప్రవాహాలు, అడుగంటిన భూగర్భ జలాలతో స్థానికంగా పని దొరక్క ఇక్కడి
ప్రజలు వలస పోతున్నారని చెప్పారు. ఏపీ రీఆర్గనైజషన్ యాక్ట్ ప్రకారం వెనుకబడిన రాయలసీమ జిల్లాలకు స్పెషల్ డెవలప్ మెంట్ ప్యాకేజీని కల్పించాలని కోరారు. కృష్ణా ఎగువనున్న రాష్ట్రాలు అక్రమంగా అనేక ప్రాజెక్టులు చేపట్టాయని, కేటాయింపులకు మించి ప్రాజెక్టులు కట్టడంతో దిగువ
రాష్ట్రాల ప్రయోజనాలు దెబ్బతింటున్నాయన్నారు. క్రమంగా కృష్ణాలో ప్రవాహాలు తగ్గాయని, మిగతా నదులపైనా ఇలాగే అక్రమ ప్రాజెక్టులు నిర్మించాయని పేర్కొన్నారు.

For More News..

లక్షలు పెడతామన్నా బెడ్లు లేవ్.. నరకం చూస్తున్న కరోనా పేషెంట్లు

సర్కార్ తప్పులు.. ఆఫీసర్లకు శిక్షలు

Latest Updates