ఫోన్ లో లాక్ డౌన్..షార్ట్ ఫిల్మింలో తడాఖా ముద్దుగుమ్మ

నటిగా, సింగర్ గా  సౌత్‌ ఇండస్ట్రీలో ఓ గుర్తింపు తెచ్చుకుంది ఆండ్రియా జెర్మియా. తన కెరీర్‌ మొత్తంలో ఒకే ఒక్క తెలుగు సినిమాలో నటించింది. అదే ‘తడాఖా’. అయితే డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగువారి ముందుకి తరచూ వస్తూనే ఉంటుంది. ప్రస్తుం విజయ్ ‘మాస్టర్’ మూవీతో పాటు మరో నాలుగు తమిళ సినిమాలు చేస్తోంది. లాక్‌డౌన్‌ కారణంగా ఇంట్లోనే ఉంది. అయితే ఖాళీగా లేదు. ఇంట్లోఉంటూనే ఓ షార్ట్ఫిల్మ్ చేసింది. ‘లాక్ డౌన్’ పేరుతో ఆధవ్ కన్న దాసన్ ఈ షార్ట్ఫిల్మ్ రూపొందించాడు. ఒకే ఒక్క రోజులో, ఫోన్తోనే ఈ మూడు నిమిషాల షాట్ ఫిల్మిం చేయడం విశేషం. లాక్ డౌన్ పరిస్థితుల్లో ని అనుభవాలను ఇందులో చూపించనున్నారట. కెమెరామేన్ నితిన్ దాస్ ఆండ్రియా ఇంటి పక్కనే ఉంటాడట. దాంతో అతను ఫోన్‌తో షూట్ చేశాడట. దాన్ని ఎడిటర్ కార్తీక్‌కి పంపిస్తే.. అతడు తన పని పూర్తి చేశాడట. ‘ఎక్కడివాళ్లం అక్కడే ఉండి ఇదంతా చేశాం. ఆధవ్ చాలా టాలెంటెడ్. తన ప్రయత్నంనాకు నచ్చింది. మా షార్ట్ ఫిల్మిం  అందరికీ నచ్చుతుం ది’ అంటోంది ఆండ్రియా. కరోనా, లాక్‌డౌన్‌లపై అవగాహన కల్పించేందుకు ఎవరికి తోచిన రీతిలో వాళ్లు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆండ్రియా టీమ్ ఈ ప్రయత్నం చేసింది. వారిని మెచ్చుకోవాల్సిందే.

Latest Updates