నెట్ బ్యాంకింగ్ పై అప్రమత్తం.. హెచ్చరించిన కేంద్ర నిఘూ వర్గాలు

ఆండ్రాయిడ్ మొబైల్ వినియోగదారులకు ఇండియన్ నోడల్ సైబర్ సెక్యూరిటీ హెచ్చరికలు జారీ చేసింది.  సైబర్‌ సెక్యూరిటీ ఏజెన్సీ ప్రకారం ఈవెంట్‌ బాట్ అనే కొత్త బ్యాంకింగ్ వైరస్ వ్యాప్తి చెందుతున్నట్లు తెలుస్తోంది. ఇది మొబైల్ బ్యాంకింగ్ తో పాటు, ఇతర ఫైనాన్షియల్ సంస్థల నుంచి డేటాను తస్కరించి అకౌంట్ పిన్ ను స్వాధీనం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఎస్ ఎం ఎస్ మరియు మాల్వేర్ సాయంతో నెట్ బ్యాంకింగ్ వినియోగదారుల్ని టార్గెట్ చేస్తుంది. అలా టార్గెట్ చేసిన అకౌంట్ హోల్డర్ల నెట్ బ్యాంకింగ్ నుంచి మనీ తో పాటు, క్రిప్టో కరెన్సీ, ఇతర ఫైనాన్షియల్ సర్వీసుల నుంచి సుమారు 200 వేర్వేరు మార్గాల ద్వారా అకౌంట్ల హోల్డర్లను టార్గెట్ చేస్తుందని అధికారులు చెబుతున్నారు.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఈవెంట్ బాట్ యూఎస్, యూరప్ కు చెందిన డివైజ్ లను టార్గెట్ చేస్తుందని, వీటితో పాటు ఇండియాలో కొంతమంది స్మార్ట్ ఫోన్ వినియోగదారుల్ని అకౌంట్ల ను హ్యాక్ చేస్తారనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పేపాల్ బిజినెస్, రివాలట్, బార్క్లేస్, యూని క్రెడిట్, క్యాపిటల్ వన్ యుకె, హెచ్ఎస్బిసి యుకె, ట్రాన్స్ఫర్ వైజ్, కాయిన్బేస్, పేసా ఫే కార్డ్ వంటి ఫైనాన్షియల్ సంస్థల్ని టార్గెట్ చేస్తున్నట్లు సైబర్ సెక్యూరిటీ హెచ్చరికలు జారీ చేసింది.

Latest Updates