గుడికొచ్చిన అంగన్‌వాడీ కార్యకర్తను రేప్ చేసి చంపిన పూజారి

ఉత్తరప్రదేశ్‌లోని బడాన్ జిల్లాలో దారుణం జరిగింది. ఉఘైటి ప్రాంతంలో 50 ఏళ్ల మహిళపై ఆలయ పూజారి, అతని ఇద్దరు స్నేహితులు అత్యాచారం చేసి హత్య చేశారు. దాంతో రోజూవారీలాగానే గుడికి వెళ్లిన మహిళ.. శవమై ఇంటికి చేరింది. స్థానికంగా నివసించే మహిళ అంగన్‌వాడీ వర్కర్‌గా పనిచేస్తుంది. ఆమె జనవరి 3న సాయంత్రం 5 గంటల సమయంలో గుడికి వెళ్లింది. కానీ, రాత్రి వరకు ఇంటికి తిరిగిరాలేదు. రాత్రి 11:30 గంటల సమయంలో ఆమె మృతదేహాన్ని ఆలయ పూజారితో పాటు మరో ఇద్దరు వ్యక్తులు తీసుకొచ్చి ఆమె ఇంటి ముందు వదిలి వెళ్లారు. తమ తల్లికి ఏమైందని ఆమె కొడుకు వారిని అడుగగా.. సరైన సమాధానం చెప్పకుండానే అక్కడినుంచి జారుకున్నారు. మహిళ కాలు విరగడం, ఆమె ప్రైవేట్ భాగాలన్నీ రక్తంమయం కావడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు మహిళ ఇంటికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. మహిళ కొడుకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. పోలీసులు ఆలయ పూజారిని విచారించారు. ‘గుడికి వచ్చిన మహిళ.. గుడి బయట ఉన్న బావిలో పడినట్లు శబ్దం వచ్చింది. దాంతో తాను మరో ఇద్దరితో కలిసి వచ్చి ఆమెను బావి నుంచి బయటకు తీశామని.. కానీ అప్పటికే ఆమె మృతిచెందింది’ అని పూజారి పోలీసులకు తెలిపాడు. పోస్టుమార్టంలో మాత్రం మహిళపై అత్యాచారం జరిగిందని.. ఆ తర్వాతే ఆమెను హత్యచేశారని తేలింది. అంతేకాకుండా ఆమె కాలు విరగడంతో పాటు.. ఆమె ప్రైవేట్ భాగాలన్నీ గాయాలపాలైనట్లు రిపోర్టు వచ్చింది. దాంతో పోలీసులు.. మరోసారి పూజారిని అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటపడింది.

‘అంగన్‌వాడీ వర్కర్‌పై జరిగిన హత్యాచారం కేసుకు సంబంధించి ఆలయపూజారిని అదుపులోకి తీసుకున్నాం. మరో ఇద్దరు నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేకబృందాన్ని ఏర్పాటు చేశాం. నిందితులపై సెక్షన్ 376 మరియు 302ల కింద కేసు నమోదు చేశాం. త్వరలోనే నిందితులను అరెస్టు చేస్తాం’ అని బడాన్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ సంకల్ప్ శర్మ అన్నారు.

For More News..

భార్యను చంపి.. మూటకట్టి పడేసిన భర్త

యువతి కడుపులో 2.5 కేజీల వెంట్రుకల బంతి

బ్రెయిన్ షార్ప్‌‌గా ఉండాలంటే రోజూ ఇవి తినండి

Latest Updates