కరోనా పై సరైన సమాచారం ఇవ్వండి

జర్మనీ : కరోనా కు సంబంధించి చైనా సరైన సమాచారం ఇవ్వాలని జర్మనీ చాన్స్ లర్ ఏంజెలా మెర్కెల్ కోరారు. కరోనా వ్యాప్తిని అరికట్టే విషయంలో గానీ వైరస్ ఎలా పుట్టుందన్న దానిపై సమాచారం విషయంలో గానీ చైనా వ్యవహారిస్తున్న తీరుపై విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ విషయంలో చైనాపై అమెరికా ఒత్తిడి తెస్తోంది. తాజాగా జర్మనీ సైతం చైనా పై అసహనం వ్యక్తం చేసింది. ప్రపంచ దేశాలను కుదిపేస్తోన్న కరోనాను నివారించాలంటే దానిపై సరైన సమాచారం అవసరమని జర్మనీ చెబుతోంది. ఈ క్రమంలోనే కరోనా వైరస్ విషయంలో పారదర్శకంగా ఉండాలని చైనాను జర్మనీ చాన్సలర్ ఏంజెల్ మెర్కెల్ కోరారు. ‘‘ వైరస్‌ ఎలా పుట్టిందన్న దానిపై చైనా పారదర్శంగా వ్యవహరిస్తుందని భావిస్తున్నా. వారు ఇచ్చే సమాచారం ఆధారంగానే కరోనాను ఎదుర్కోగలం ” అని విజ్ఞప్తి చేశారు. వుహాన్ లోని ల్యాబ్ నుంచే కరోనా వైరస్ లీక్ అయ్యిందని అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.

Latest Updates