రాజకీయాల్లోకి వస్తా.. ఏంజెలీనా జోలీ సంకేతాలు

బీబీసీకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన మనసులో మాట బయటపెట్టారు హాలీవుడ్ యాక్టర్ ఏంజెలినా జోలీ. భవిష్యత్తులో రాజకీయాల్లోకి రావొచ్చంటూ ఆమె సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం ఏంజెలినా జోలీ.. ఐక్య రాజ్యసమితి శరణార్థి సంస్థకు రాయబారిగా ఉన్నారు. శరణార్థుల సమస్యలు, లైంగిక హింస, సహజ వనరులను పరిరక్షించే కార్యక్రమాల్లో ఆమె కొన్నేళ్లుగా చురుగ్గా పాల్గొంటున్నారు.

యూఎస్ రాజకీయాలు, సోషల్ మీడియా, సెక్సువల్ వయొలెన్స్, గ్లోబర్ రెఫ్యూజీ క్రైసిస్ అంశాలపై ఏంజెలినా జోలీ ఇంటర్వ్యూలో స్పందించారు. రాజకీయాల్లోకి వస్తారా అని ప్రశ్నించినప్పుడు.. “ఈ ప్రశ్న ఇరవై ఏళ్ల కింద అడిగి ఉంటే నేను కచ్చితంగా నవ్వేదాన్ని. నాకు ఏది అవసరమో.. అక్కడకే నేను వెళ్తా. రాజకీయాలకు సరిపోతానా లేదా అనేది నాకు తెలియదు. ప్రభుత్వాలతో కలిసి పనిచేయాలి… మిలటరీతో కలిసి పనిచేయాలి.. ఐతే.. ఆసక్తిగా అనిపించే రంగంలో ఉండి… సాధ్యమైనంత ఎక్కువ పనిచేయడానికి ప్రయత్నిస్తా” అని ఏంజెలీనా జోలీ చెప్పారు.

బీబీసీలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ హోదాలో… చిల్డ్రన్ న్యూస్ ప్రోగ్రామ్ అనే షో చేస్తున్నారు జోలీ. వచ్చే ఏడాది నుంచి ఈ ప్రోగ్రామ్ ప్రసారం కానుంది. అంతర్జాతీయంగా ఏం జరుగుతుందో పిల్లలకు చెప్పబోతున్నందుకు తనకు సంతోషంగా ఉందని అన్నారు.

హాలీవుడ్ ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న హీరోయిన్ గా ఏంజెలీనా జోలీ పేరు మార్మోగింది. ఓసారి ఆస్కార్ ఉత్తమ నటిగానూ నిలిచారామె. బ్రాడ్ పిట్ ను పెళ్లిచేసుకున్న జోలీ.. ఇప్పటివరకు ముగ్గురు పిల్లలను దత్తత తీసుకుంది. వీరిద్దరూ కలిసి..  బయోలాజికల్ పద్ధతిలో ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఆ తర్వాత సహజంగా.. ఓ మగబిడ్డ, ఆడ బిడ్డను ప్రసవించింది ఏంజెలీనా జోలీ. బ్రెస్ట్ క్యాన్సర్ తోనూ పోరాడి విజయం సాధించింది.

Posted in Uncategorized

Latest Updates