ఇర్ఫాన్ మృతికి ఏంజెలీనా జోలీ సంతాపం

లాస్ ఏంజిల్స్: ఇండియన్ యాక్టర్ ఇర్ఫాన్ ఖాన్ మరణం పట్ల హాలీవుడ్ సూపర్ స్టార్ ఏంజెలీనా జోలీ సంతాపం వ్యక్తం చేశారు. మైటీ హార్ట్ సెట్‌లో ఇర్ఫాన్ ఖాన్‌తో కలిసి పనిచేసే అవకాశం లభించిందని, కళాకారుడిగా ఇర్ఫాన్ ప్రత్యేకతను చాటుకున్నారని కొనియాడారు. గొప్ప ఆర్టిస్ట్ తో కలిసి పనిచేసినందుకు సంతోషంగా ఉందని, ఆయన మంచితనం, చిరునవ్వు గుర్తున్నాయని ట్వీట్ చేశారు. “ప్రపంచ దేశాల్లో, ఇండియాలో ఇర్ఫాన్​ను ఆరాధించే కుటుంబ సభ్యులు, బంధువులు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి”అని జోలీ ట్వీట్​లో పేర్నొన్నారు. 2007లో రిలీజ్ అయిన ఎ మైటీ హార్ట్ మూవీలో ఏంజెలీనా జోలీతో కలిసి ఇర్ఫాన్ నటించారు. రెండేళ్లుగా కేన్సర్ తో పోరాడుతున్న ఇర్ఫాన్ ఖాన్ బుధవారం ముంబైలోని ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు.

Latest Updates