మూడు వారాల్లో అప్పు కట్టండి

  • అనిల్ అంబానీకి యూకే కోర్టు ఆదేశాలు

లండన్ : చైనా బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పు మూడు వారాల్లో కట్టాలంటూ అనిల్ అంబానీని యూకే కోర్టు ఆదేశించింది. 2012 లో రిలయన్స్ కామ్ కోసం చైనాకు చెందిన 3 బ్యాంకుల నుంచి దాదాపు రూ. 5446 కోట్లు తీసుకున్నారు. ఈ అప్పుకు అనిల్ అంబానీయే హామీగా ఉన్నారు. ప్రస్తుతం రిలయన్స్ కామ్ దివాళాలో ఉండటంతో తమ అప్పు చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ చైనా బ్యాంకులు లండన్ కోర్టుకు వెళ్లాయి. బ్యాంకుల అభ్యర్థనను విన్న లండన్ కోర్టు 3 వారాల్లో అప్పు మొత్తం చెల్లించాల్సిందేనంటూ ఆర్డర్ వేసింది. లాక్ డౌన్ కారణంగా రిమోట్ హియరింగ్ ద్వారా కేసు విచారించారు. రిలయన్స్ కామ్ అప్పు చెల్లించలేకపోతే హామీగా ఉన్న అనిల్ అంబానీయే చెల్లించాలంటూ కోర్టు స్పష్టం చేసింది. లేదంటే చర్యలు తప్పవంటూ హెచ్చరించింది. గతంలోనూ ఈ కేసు విచారణ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అప్పు చెల్లించలేని పరిస్థితిలో ఉన్న అనిల్ అంబానీ కోట్ల విలువ చేసే బిల్డింగ్స్, లగ్జరీ లైఫ్ ఎలా మెయింటైన్ చేస్తున్నారని ప్రశ్నించింది.

Latest Updates