యస్ బ్యాంక్ సంక్షోభంలో అనీల్ అంబానీకి సమన్లు

యస్ బ్యాంక్ సంక్షోభానికి సంబంధించి రిలయన్స్ గ్రూప్ చీఫ్ అనిల్ అంబానీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులిచ్చింది. యస్ బ్యాంక్ నుంచి అనీల్ అంబానీ తీసుకున్న రుణాలకు సంబంధించి ఆయనను ప్రశ్నించనున్నట్లు సమాచారం. ముంబైలోని ప్రోబ్ ఏజెన్సీ అధికారుల ముందు ఆయన హాజరుకావాలని ఈడీ నోటీసులు జారీ చేసింది. యస్ బ్యాంకు నుంచి అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూప్ రూ. 12,000 కోట్లకు పైగా రుణాలు తీసుకుంది. ఆ రుణాల విషయమై అనీల్‌ను ప్రశ్నించాలని ఈడీ నిర్ణయించింది. అయితే తన ఆరోగ్యం బాగాలేదని.. ఈడీ ముందు హాజరుకావడానికి మరికొంత సమయం ఇవ్వాలని అనీల్ ఈడీని కోరాడు. దాంతో ఈడీ మరో తేదీని ప్రకటించనున్నట్లు సమాచారం. యస్ బ్యాంక్ సంక్షోభానికి పెద్ద కంపెనీల రుణాలే కారణమని.. అందులో అనీల్ అంబానీ కంపెనీ కూడా ఒకటని ఈడీ తేల్చింది. కాగా.. బ్యాంక్ సంక్షోభానికి సంబంధించి ఆ బ్యాంక్ డైరక్టర్ రాణా కపూర్‌ని ఈ నెల మొదటివారంలోనే ఈడీ అదుపులోకి తీసుకుంది.

For More News..

మధ్యప్రదేశ్‌ అవిశ్వాసంపై గవర్నర్ అనూహ్య నిర్ణయం

ఏప్రిల్‌ ఒకటి తర్వాత ఆ బండ్లన్నీ స్క్రాపే

కరోనాపై ఇండియన్ డాక్టర్ల ముందడుగు

మహేశ్ కాదన్న సినిమా.. పవన్ చేస్తున్నాడా?

Latest Updates