జంతువులపై ప్రయోగంలో కోవ్యాక్సిన్ సక్సెస్

వెల్లడించిన భారత్ బయోటెక్
న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ రూపొందించే పనుల్లో అనేక దేశాలు తలమునకలై ఉన్నాయి. ఇండియాకు చెందిన భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ కూడా కోవ్యాక్సిన్ తయారీలో బిజీగా ఉంది. తాజాగా జంతువులపై నిర్వహించిన ట్రయల్స్‌‌‌‌లో భారత్ బయోటెక్ సక్సెస్ అయింది. ఫేజ్-1 క్లినికల్ ట్రయల్స్‌‌‌లో ఇమ్యూన్ డెవలప్‌‌‌మెంట్‌‌తోపాటు రక్షించే కెపాసిటీ కూడా పెరిగిందని భారత్ బయోటెక్ తెలిపింది. కోవ్యాక్సిన్‌‌‌‌‌‌‌ను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్), భారత్ బయోటెక్‌‌‌లు కలసి రూపొందించాయి.

దేశంలోని 12 మెడికల్ ఇన్‌‌స్టిట్యూట్స్‌‌‌లో కోవ్యాక్సిన్‌‌‌ను టెస్టింగ్ చేస్తున్నారు. తాజాగా జంతువులపై చేసిన ట్రయల్స్‌‌‌లో కోవ్యాక్సిన్ విజయవంతమైంది. కోతులపై ఈ ప్రయోగాన్ని చేసినట్లు తెలుస్తోంది. ‘కోవ్యాక్సిన్ యానిమల్ రిజల్ట్స్ గురించి ప్రకటించడానికి గర్విస్తున్నాం. వైరల్ ఛాలెంజ్ మోడల్‌‌‌లో రక్షణ సామర్థ్యం పెరిగింది’ అని భారత్ బయోటెక్ ట్వీట్ చేసింది. సార్ కోవ్ 2ను క్రియా రహితం చేసేంత రక్షణ సామర్థ్యం, ఇమ్యూన్ పవర్‌‌‌ను వ్యాక్సిన్‌‌లో డెవలప్ చేశామని పేర్కొంది. రెండో ఫేజ్ ట్రయల్స్‌‌‌ను నిర్వహించేందుకు భారత్ బయోటెక్‌‌‌కు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్‌‌ అప్రూవల్ ఇచ్చింది.

Latest Updates