నువ్వు మామూలోడివి కాదు గురూ..!

క్రియేటివ్ వీడియో ఎడిటింగ్ తో ఆకట్టుకుంటున్న పెర్రీ
న్యూఢిల్లీ: టెక్నాలజీ ఎంతగా అప్ గ్రేడ్ అయిందో చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా యానిమేషన్, ఎడిటింగ్ రంగాల్లో టెక్నాలజీ వాడకం విపరీతంగా పెరిగింది. సినిమాలు, సెలబ్రిటీలు, ఫొటోలు, వీడియోలకు సంబంధించి ఏది నిజమో కాదో తెలుసుకోలేనంతగా పరిస్థితి తయారైంది. ఇప్పుడు ఇలాంటి ఓ వీడియో గురించి మనం తెలుసుకోబోతున్నాం. టెక్నాలజీకి తన క్రియేటివిటీ, డిజైన్ ను జోడించి సదరు వ్యక్తి చేసిన వీడియో వర్చువల్ వరల్డ్ మ్యాజిక్ గా చెప్పొచ్చు. కెవిన్ పెర్రీ అనే ఆ వ్యక్తి స్టాప్ మోషన్ యానిమేటర్ గా పని చేస్తున్నాడు. అతడు పోస్ట్ చేసిన ఓ వీడియో ఇప్పుడు అందర్నీ ఆకట్టుకుంటోంది.

View this post on Instagram

I don’t know what this is or why I made it 🔍👁

A post shared by Kevin Parry (@kevinbparry) on

తన కనుగుడ్డులో తానే కూర్చున్నట్లుగా తయారు చేసిన ఈ వీడియో పెర్రీ క్రియేటివ్ ట్యాలెంట్ కు నిదర్శనంగా చెప్పొచ్చు. ఆ వీడియోను తాను రూపొందించిన విధానం, ఎడిటింగ్, యానిమేషన్ ఎలా చేశాననేది పెర్రీ మరో వీడియోలో వివరించాడు. ఈ వీడియోకు ‘ఇదేంటో నాకు తెలియదు, లేదా నేనెందుకు తయారు చేశానో కూడా తెలియదు’ అని పెర్రీ క్యాప్షన్ జత చేశాడు. నీ బ్రెయిన్ నెక్స్ట్ లెవల్ లో ఉందని, అమేజింగ్, చెప్పలేనంత బాగుందంటూ పెర్రీపై నెటిజన్స్ మెచ్చుకోళ్ల వర్షం కురిపిస్తున్నారు. మరి క్రియేటివ్ ట్యాలెంట్ ఉన్న ఉదాహరణగా ఉన్న వీడియోను మిస్సవకండి.. చూసేయండి!

View this post on Instagram

How I made this weird eyeball trick 🔍👁

A post shared by Kevin Parry (@kevinbparry) on