అతడిది హత్య అని నేనెప్పుడూ అనలేదు

సుశాంత్ మాజీ ప్రేయసి అంకితా లోఖండే
ముంబై: సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ను హత్య చేశారని తానెప్పుడూ అనలేదని అతడి మాజీ గర్ల్ ఫ్రెండ్ అంకితా లోఖండే చెప్పింది. అయితే సుశాంత్ కుటుంబానికి న్యాయం జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. ఈ కేసులో డ్రగ్స్ ఆరోపణలతో రియా చక్రవర్తిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. రియా అరెస్ట్ పై అంకిత ట్వీట్ చేసింది. ‘అనుకోకుండా ఏదీ జరగదు, ప్రతిదీ రాతను బట్టే జరుగుతుంది. నీ భవిష్యత్ ను స్వీయ చర్యల ద్వారా నువ్వే రాసుకుంటావ్. దాన్నే కర్మ అంటారు’ అని అంకిత ట్వీట్ చేసింది.

‘సుశాంత్ ది మర్డరా లేక సూసైడా? అని పలుమార్లు మీడియా నన్ను అడిగింది. అది హత్య అని నేనెప్పుడూ చెప్పలేదు. అదే సమయంలో దీనికి ఫలానా వాళ్లు బాధ్యులని కూడా ఆరోపించలేదు. నా ఫ్రెండ్ (సుశాంత్) కేసులో న్యాయం జరగాలని కోరుకుంటున్నా. అందుకే అతడి ఫ్యామిలీకి మద్దతుగా నిలిచా. కేసులో విచారణ జరుపుతున్న ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు నిజాల నిగ్గు తేల్చుతాయనే నమ్మకం ఉంది’ అని అంకిత పేర్కొంది.

Latest Updates