అన్నాడీఎంకే సీఎం అభ్యర్ధి పళనిస్వామి

చెన్నై: మరికొన్ని నెలల్లో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు తమ పార్టీ సీఎం క్యాండిడేట్‌గా పళనిస్వామిని అధికార పార్టీ అన్నాడీఎంకే ప్రకటించింది. ఈ మేరకు శనివారం అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్, కార్యవర్గం ఆమోదం తెలిపాయి. అన్నాడీఎంకే కో ఆర్డినేటర్ పన్నీర్ సెల్వం, జాయింట్ కో ఆర్డినేటర్ పళనిస్వామి ఆధ్వర్యంలో జరిగిన మీటింగ్ లో 16 తీర్మానాలను ఆమోదించారు. గత ఏడాది ప్రకటించిన స్టీరింగ్ కమిటీలకు అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీతో దోస్తీ ఉంటుందని అన్నాడీఎంకే టాప్ లీడర్లు ఇదివరకే ప్రకటించారు.వ్యక్తులకన్నా పార్టీ గొప్పదని, వచ్చే ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించేలా కృషి చేయాలని అన్నాడీఎంకే కార్యకర్తలకు పళనిస్వామి పిలుపునిచ్చారు. తమ పార్టీలో విభేదాలు లేవన్నారు.

Latest Updates