త్వరలో నిరుద్యోగ భృతిపై కీలక ప్రకటన

త్వరలోనే నిరుద్యోగ భృతిపై ప్రకటన ఉంటుందన్నారు మంత్రి కేటీఆర్. ఇప్పటికే లక్ష 31వేల ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. మరో 50వేల ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టినట్లు తెలిపారు.తెలంగాణ భవన్ లో జరిగిన TRS విద్యుత్ కార్మిక సంఘం సమావేశంలో మాట్లాడారు కేటీఆర్. ఉద్యోగ నియామకాలపై ప్రతిపక్ష నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు. కేసీఆర్ ను విమర్శించే నాయకులు ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు.

7 వేల మెగావాట్ల నుంచి 16 వేల మెగావాట్ల స్థాపిత విద్యుత్ సామార్ధ్యానికి తీసుకొచ్చామన్నారు. తెలంగాణలో కరెంట్ సమస్య లేదని గర్వంగా చెప్పుకునే స్థితికి విద్యుత్ ఉద్యోగులు తీసుకొచ్చారన్నారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో దేశంలోనే రెండవ స్థానంలో ఉన్నామన్నారు.  తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నామని చెప్పారు. 100 శాతం ఇంటింటికి నీరిచ్చిన  ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేయడంలో విద్యుత్ ఉద్యోగుల పాత్ర కీలకమన్నారు.

Latest Updates