రాష్ట్రంలో కొత్తగా 2,511 కరోనా కేసులు.. 11 మంది మృతి

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 2,511 కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. దాంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 1,38,395 కేసులు నమోదయ్యాయి. తాజాగా శుక్రవారం కరోనా బారినపడి 11 మంది చనిపోయారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 877కు చేరింది. రాష్ట్రంలో కొత్తగా 2,579 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దాంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారిసంఖ్య 1,04,603గా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 32,915 కేసులు యాక్టివ్ గా ఉన్నట్లు తెలిపింది. మరో 25,729 కేసులు హోంఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపింది.

ఇక జిల్లాల్లో నమోదయిన కరోనా కేసుల విషయానికొస్తే.. జీహెచ్ఎంసీలో 305, రంగారెడ్డి 184, నల్గొండ 170, కరీంనగర్ 150, ఖమ్మం 142, మేడ్చల్ 134, వరంగల్ అర్బన్ 96, సూర్యపేట్ 96, భద్రాద్రి 93, నిజామాబాద్ 93, జగిత్యాల 85, సిద్ధిపేట్ 80, యాదాద్రి 78, మంచిర్యాల్ 73, రాజన్న సిరిసిల్ల 72, సంగారెడ్డి 70, పెద్దపల్లి 65, కామారెడ్డి 60, మహబూబా బాద్ 58 కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.

For More News..

యాదాద్రి నరసింహుడికి బంగారు తలుపు

కలలో కూడా అలా అనుకోను

సీఎస్కేకు వరుస షాకులు.. రైనా దారిలో భజ్జీ

Latest Updates