సంధ్య కన్వెన్షన్ ఎండీపై మరో కేసు నమోదు

సంధ్య కన్వెన్షన్ ఎండీపై మరో కేసు నమోదు

చీటింగ్, బెదిరింపుల కేసులో అరెస్టయిన సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావుపై మరో ఫిర్యాదు నమోదైంది. శ్రీధర్ రావు తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడంటూ ఆయన వ్యక్తిగత ట్రైనర్ సనత్‎నగర్ పోలీస్ స్టేషన్‎లో ఫిర్యాదు చేశాడు. బాడీ మసాజ్ పేరుతో ఇంటికి పిలిచి.. మసాజ్ చేస్తుండగా వికృత చేష్టలకు పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. అంతేకాకుండా శ్రీధర్ రావు తనతో అన్ నేచురల్ సెక్స్ చేశారని.. ఈ విషయాన్ని బయటకు చెబితే చంపేస్తానని బెదిరించాడని తెలిపాడు. 

ఇప్పటికే ఓ కేసులో అరెస్టయిన శ్రీధర్ రావుకు రూ. 20 వేల వ్యక్తిగత పూచికత్తుతో శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. కేసు విచారణను ఈ నెల 22కి వాయిదా వేస్తున్నట్లు కోర్టు తెలిపింది. ఈ లోగానే ఆయనపై మరో కేసు నమోదుకావడం గమనార్హం.