మరో చెస్ టైటిల్ ముంగిట హరికృష్ణ

హైదరాబాద్‌‌, వెలుగు: ఇండియా గ్రాండ్‌‌ మాస్టర్‌‌ పెంటేల హరికృష్ణ మరో టైటిల్‌‌కు ముంగిట నిలిచాడు. స్వి ట్జర్లాండ్‌‌లో జరుగుతున్న బీల్ ఇంటర్నేషనల్‌‌ చెస్ ఫెస్టివల్ క్లా సికల్ ఈవెంట్‌‌లో తెలుగు ప్లేయర్‌‌ అద్భుత పెర్ ఫామెన్స్ చేస్తున్నాడు. మంగళవారం జరిగిన ఆరో రౌండ్‌‌లో 44 ఎత్తుల్లో  ఎడ్యు వార్డ్‌‌ (ఫ్రాన్స్‌‌) ను ఓడించాడు. దాంతో మొత్తం 32.5 పాయింట్లతో సెకండ్‌‌ ప్లేస్‌‌లో నిలిచాడు.

టాప్‌‌ ప్లేస్‌‌లో ఉన్న పోలాండ్‌‌ ప్లే యర్‌‌ రడొస్లావ్‌ వొజాస్జెక్‌‌ (33)కు హరికి మధ్య అర పాయింట్‌‌ గ్యాప్‌ మాత్రమే ఉంది. ఆరో రౌండ్‌‌లో రడొస్లావ్‌ జర్మన్ టీనేజర్‌‌ విన్సెంట్‌‌తో గేమ్‌‌ను డ్రా చేసు కోవడం హరికి ప్లస్‌‌ అయింది. బుధవారం జరిగే లా స్ట్‌‌ రౌండ్‌‌లో స్పెయిన్‌‌ ప్లే యర్‌‌ డేవిడ్‌‌ ఆంటోన్‌‌తో హరి పోటీ పడనున్నాడు. ఇందులో గెలిస్తే అతను కనీసం రన్నరప్‌‌గా అయినా నిలుస్తాడు.

Latest Updates