తెలంగాణలో నాలుగో కరోనా కేసు.. దేశ వ్యాప్తంగా 126..

రాష్ట్రంలో మరొకరికి కరోనా వైరస్ సోకింది. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య నాలుగుకు చేరింది. ఐదు రోజుల కింద స్కాట్లాండ్ దేశానికి వెళ్లొచ్చిన హైదరాబాద్‌‌కు చెందిన వ్యక్తి (46) కి వైరస్ పాజిటివ్గా తేలినట్టు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించిం ది. ఆయనకు గాం ధీ హాస్పిటల్‌ లో ట్రీట్‌మెంట్ అందిస్తున్నామని తెలిపింది. ఆ వ్యక్తి స్కాట్లాండ్ నుండి వచ్చిన మరుసటి రోజే జ్వరం రావడంతో.. నేరుగా గాంధీ హాస్పిటల్​లో చేరాడని వెల్లడించింది. బాధితుడితో కాంటా క్ట్ అయిన 11 మందిని గుర్తించామని, వారికి టెస్టులు చేయిస్తున్నామని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో నమోదైన నాలుగు కరోనా కేసుల్లో ఇప్పటికే ఒకరు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. మిగతా ముగ్గురు గాంధీలో చికిత్స పొందుతున్నారు. ఇందులో ఓ బాధితురాలి తండ్రికి వైరస్ నెగిటివ్ వచ్చిందని అధికారులు తెలిపారు. ఆమెతో కాంటాక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయిన 28 మందిని క్వారంటైన్‌లో ఉంచారు. నెదర్లాండ్స్​ నుంచి వచ్చిన రంగారెడ్డి జిల్లా వ్యక్తితో 13 మంది కాంటాక్ట్ అయినట్టు గుర్తించి న అధికారులు.. వారిని కూడా క్వారంటైన్ చేశారు.

దేశ వ్యాప్తంగా 126 కేసులు.. 13 మంది డిశ్చార్జ్

దేశంలో కరోనా కేసుల సంఖ్య 126కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం ఉదయం ప్రకటించింది. ఇందులో 104 మంది ఇండియన్స్ కాగా.. 22 మంది విదేశీయులు ఉన్నారని తెలిపింది. ఇండియాలో ఇప్పటి వరకు ముగ్గురు మరణించారని పేర్కొంది. కరోనాతో చికిత్స పొందుతూ కర్ణాటకలో 76 ఏళ్ల వృద్ధుడు, ఢిల్లీలో 69 ఏళ్ల మహిళ, మహారాష్ట్రలో 64 ఏళ్ల వ్యక్తి మరణించగా.. దేశ వ్యాప్తంగా 13 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని వెల్లడించింది.

రాష్ట్రాల వారీగా…

ఇప్పటి వరకు దేశంలో 15 రాష్ట్రాలకు కరోనా వ్యాపించింది. అత్యధికంగా మహారాష్ట్రలో 39 మంది వైరస్ బారినపడ్డారు. కేరళలో 24 మందికి కరోనా సోకింది. అందులో ముగ్గురు డిశ్చార్జ్ అయ్యారు. హర్యానాలో ఇప్పటి వరకు 14 మంది విదేశీయులు మాత్రమే కరోనా పేషెంట్లు చికిత్స పొందుతుండగా.. మంగళవారం ఉదయం తొలి లోకల్ కేసు నమోదైంది. తెలంగాణలో నలుగురు వైరస్ బారినపడ్డారు. తొలి పేషెంట్ డిశ్చార్జ్ కాగా.. మిగిలిన ముగ్గురు హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరులో ఒక కరోనా కేసు నమోదైంది.

Latest Updates