దిశ తరహా ఘోరం!: 17 ఏళ్ల అమ్మాయి దహనం.. గ్యాంగ్ రేప్‌పై అనుమానాలు

దేశంలో ఆడపిల్లకు రక్షణ కరువవుతోంది. పసి పిల్లల నుంచి ముసలి అవ్వల దాకా ఎవరనీ వదలట్లేదు కామాంధులు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్‌ దిశ రేప్, మర్డర్ కేసు తరహాలో మరో ఘోరం జరిగింది. పశ్చిమ బెంగాల్‌లోని కుమార్‌గంజ్ ప్రాంతంలో ఓ కల్వర్టు కింద తగలబెట్టి ఉన్న 17 ఏళ్ల అమ్మాయి మృతదేహం కనిపించింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపారు.

ఆదివారం మధ్యాహ్నం సరుకులు తెచ్చేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లిన కనిపించకుండా పోయిందని ఆమె సోదరుడు చెబుతున్నాడు. 24 గంటల తర్వాత ఆమె మృతదేహం ఈ స్థితిలో కనిపించడంతో కుటుంబం కన్నీరు మున్నీరవుతోంది. తమ బిడ్డపై ఎవరో దుర్మార్గులు గ్యాంగ్ రేప్ చేసి నిప్పంటించి తగలబెట్టారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఆమె తల్లిదండ్రులు. దీనిపై దర్యాప్తు చేసి.. నిందితులకు కఠిన శిక్ష పడేలా చూడాలని కోరుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మంగళవారం ఉదయం ముగ్గురు అనుమానితులను అరెస్టు చేశామని చెప్పారు. పోస్టుమార్టం రిపోర్ట్ వస్తే గానీ రేప్ జరిగిందా లేదా అన్నది చెప్పలేమని సౌత్ దింజ్‌పూర్ జిల్లా ఎస్పీ దేవర్షి దత్తా తెలిపారు.

More News:

‘రేప్‌ల రాజధానిగా భారత్’

సాయంత్రం నుంచి స్కెచ్ వేసి.. గ్యాంగ్ రేప్ చేసి తగలబెట్టారు

ఆడ, మగ అంగీకారంతోనే రేప్‌లు: పోలీస్ వివాదాస్పద వ్యాఖ్యలు

Latest Updates