హైదరాబాద్ లో గుండెపోటుతో మరో డీఎస్పీ మృతి

పోలీసు శాఖను ఓ వైపు కరోనా వైరస్‌ భయపెడుతుండగా… మరోవైపు హెల్త్ ప్రాబ్లమ్స్ తో సిబ్బంది చనిపోతున్నారు. హైదరాబాద్‌లో మరో పోలీస్‌ అధికారి గుండెపోటుతో ఇవాళ(శుక్రవారం,జులై-3) మృతి చెందారు. ఎక్సైజ్‌ డిపార్ట్ మెంట్‌లో డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న రాజేంద్ర కులకర్ణి ఇవాళ ఉదయం మరణించారు. 1995 బ్యాచ్‌కు చెందిన ఆయన ఉప్పల్‌ లో నివాసం ఉంటున్నారు.

కొద్దిరోజుల క్రితమే 1995 బ్యాచ్‌కు చెందిన ఏసీబీ డీఎస్పీ ప్రతాప్‌ గుండెపోటుతో చనిపోయారు. హైదరాబాద్ లో కరోనా కేసులు రోజు రోజుకూ పెరుగుతున్న ఈ సమయంలో కొద్ది రోజు వ్యవధిలోనే ఇద్దరు పోలీసు ఉన్నతాధికారుల హఠాన్మరణం మరింత ఆందోళన కలిగిస్తున్నాయి.

Latest Updates