19న మరో అల్పపీడనం

మూడు రోజులు సాధారణ వర్షాలు

హైదరాబాద్, వెలుగు: బంగాళాఖాతంలో ఈ నెల 19న మరో అల్పపీడనం ఏర్పడే చాన్స్‌‌ ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 48 గంటల్లో అరేబియా సముద్రంప్రాంతాలలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని చెప్పింది. రానున్న మూడురోజులు రాష్ట్రంలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. గురువారం కొన్ని చోట్ల తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. ములుగులోని గోవిందరావుపేటలో 5.8, నల్గొండలోని ముల్కచర్లలో 4.6, జగిత్యాలలోని సారంగపూర్‌‌‌‌లో 4, నల్గొండలోని అజ్మాపూర్‌‌‌‌లో 2 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం  రికార్డయ్యింది.

Latest Updates