సిల్క్  స్మిత ఆటోబయోగ్రఫీతో మరో సినిమా

కంప్లీట్ లైఫ్ హిస్టరీ చూపించేందుకు  ప్రయత్నం 

సిల్క్‌‌‌‌ స్మిత.. ఈ పేరు చెబితే ఇప్పటికీ ఓ అందమైన రూపం అందరి కళ్లముందూ కదులుతుంది. గ్లామర్‌‌‌‌ రోల్స్‌‌‌‌తో ఒకప్పుడు ఎన్నో సినిమాల సక్సెస్‌‌‌‌లో కీ రోల్ పోషించింది స్మిత. కానీ అతి చిన్న వయసులో అనుకోని పరిస్థితుల్లో మరణించి ఇండస్ట్రీలో విషాదాన్ని నింపింది. తన లైఫ్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన ‘డర్టీపిక్చర్‌‌‌‌’ సూపర్ సక్సెస్‌‌‌‌ అయ్యింది. ఆ తర్వాత కన్నడ, మలయాళ భాషల్లోనూ స్మిత జీవితంపై మరో రెండు సినిమాలు వచ్చాయి. అయితే అవన్నీ తన గ్లామర్‌‌‌‌ పైనే ఎక్కువ ఫోకస్ చేశాయనే విమర్శలు ఉన్నాయి. అందుకే ఈ మూడు సినిమాల్లా కాకుండా ఆమె జీవితాన్ని కంప్లీట్‌‌‌‌గా చూపించే సినిమా తీస్తున్నామంటున్నారు తమిళ నిర్మాతలు చిత్రా లక్ష్మణన్‌‌‌‌, హెచ్.మురళి. తెలుగు, తమిళ భాషల్లో సిల్క్ జీవితంపై వీళ్లు ఓ సినిమా తీస్తున్నారు. తమిళంలో ‘అవల్ అప్పడితాన్‌‌‌‌’ అనే పేరు పెట్టారు. తెలుగు టైటిల్ ఇంకా రివీల్ చేయలేదు.  ప్రముఖ యాడ్ ఫిల్మ్ మేకర్ మణికందన్‌‌‌‌ ఈ సినిమాకి దర్శకుడు. నవంబర్‌‌‌‌ నుండి షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు. ప్రస్తుతం రైటర్స్ టీమ్‌‌‌‌తో స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారు. ఆ టీమ్‌‌లో సిల్క్‌‌ జీవితంపై పుస్తకం రాసిన దీన్ దయాళ్‌‌‌‌ కూడా ఉన్నారు. సిల్క్‌‌‌‌తో కలిసి పనిచేసిన వారి నుండి కూడా వివరాలు సేకరిస్తున్నారట. సిల్క్ పాత్రతో పాటు ఇతర క్యారెక్టర్స్‌‌‌‌కి కూడా ఆడిషన్స్ నిర్వహించి కొత్తవారిని తీసుకోబోతున్నట్టు నిర్మాతలు చెబుతున్నారు.

ముఖ్యంగా సిల్క్‌‌‌‌ పాత్రకి ఎలాంటి ఇమేజ్‌‌‌‌ లేని ఫ్రెష్‌‌‌‌ ఫేస్‌‌‌‌ని తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ‘డర్టీ పిక్చర్’ లాంటి సినిమాల్లో సిల్క్ జీవితంలోని కొన్ని విషయాలను ఉన్నది ఉన్నట్టుగా చూపించలేదనేది ఎవరూ కాదనలేని నిజం. ముఖ్యంగా ఆమెది మిస్టీరియస్‌‌‌‌ డెత్‌‌‌‌. కానీ ఆమె సూసైడ్ చేసుకున్నట్టు చూపించడం పట్ల అప్పట్లో చాలా విమర్శలు వచ్చాయి. మరి ఇప్పుడు తీయబోయే సినిమా అయినా అసలు నిజాలను చూపిస్తుందో లేదో.

Latest Updates