
హైదరాబాద్, వెలుగు : నేషనల్ మార్ట్ హైదరాబాద్లోని మెహదీపట్నంలో శనివారం స్టోర్ను అందుబాటులోకి తెచ్చింది. ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ దీనిని ప్రారంభించారు. ఇక్కడ కిరాణా, స్టేషనరీ, హోమ్, కిచెన్ అప్లయెన్సెస్, కుక్ వేర్, పాదరక్షలు, దుస్తులు ఇంకా మరెన్నో వస్తువులను సరసమైన ధరలకు ఒకే చోట అందిస్తామని సంస్థ తెలిపింది. తమ దగ్గర ప్రొడక్టులు తక్కువ ధరలకు దొరుకుతాయని, నాణ్యతలో రాజీ పడబోమని హామీ ఇచ్చింది. చాలా ప్రొడక్టులపై డిస్కౌంట్లు ఇస్తామని స్టోర్ ప్రారంభం సందర్భంగా నేషనల్ మార్ట్ ఫౌండర్ యశ్ అవాల్ చెప్పారు.