కొత్త రకం సాలీడు.. నాలుగు కండ్ల పీకాక్ స్పైడర్

కొత్త రకం సాలీడు.. నాలుగు కండ్ల పీకాక్ స్పైడర్

ఆస్ట్రేలియాలో కొత్తగా పీకాక్ స్పైడర్ జాతికి చెందిన మరో కొత్త రకం కీటకం కనిపించింది. దక్షిణ ఆస్ట్రేలియాలోని  మౌంట్ మెక్‌‌‌‌‌‌‌‌ఇంటైర్ ప్రాంతంలో ఈ కొత్త రకం సాలీడును సైంటిస్టులు గుర్తించారు. ఒక ఆడ, నాలుగు మగ సాలీళ్లు ఆ ప్రాంతంలో ఉన్నాయి. నాలుగు మిల్లీమీటర్ల సైజు మాత్రమే ఉండే వీటికి నాలుగు కండ్లు, ఆరు కాళ్లు ఉన్నాయి. వీటికి కార్టూన్ చానల్స్‌‌‌‌‌‌‌‌లో వచ్చే యానిమేటెడ్ కేరక్టర్ పేరును పెట్టారు. కార్టూన్ ఫిష్ నెమో పేరు మీదుగా ‘మారషస్ నెమో’ అని ఇకపై దీనిని పిలుస్తారు. ఈ సాలీళ్లు డాన్స్ చేయడం స్పెషల్.. అందుకే వీటి జాతిని పీకాక్ స్పైడర్ అంటారు.