సోషల్ మీడియాలో వైరల్: ఎన్టీఆర్ ను పోలిన మరో వ్యక్తి

మీకు ఏమాత్రం సంబంధం లేని డిట్టో మీలాగా ఉండే వ్యక్తి ఎదురుపడ్డారనుకోండి మీ ఫీలింగ్​ ఎట్లుంటది! ఏముంది మనుషుల్ని పోలిన మనుషులు ఏడుగురుంటారు కదా.. అందులో ఏ ఒక్కరో అయి ఉంటారులే అంటారా! సరె..సరె, ఇప్పుడిదంతా ఎందుకంటే ఈ ఫొటో చూశారుగా! ఎవరనుకుంటున్నారు.. ఎన్టీఆర్​ కదా! అలా అనుకుంటే పప్పులో కాలేసినట్టే మరి. అదేంటి ఎన్టీఆర్​ను పట్టుకుని ఎన్టీఆర్​ కాదంటారేంటి అంటారా? అవును, అతడు ఎన్టీఆర్​ కాదు. డిట్టో ఎన్టీఆర్​లా ఉన్న డూప్​ ఎన్టీఆర్​. కళ్లు, ముక్కు, చెవులు, మొహం, నోరు ప్రతిదీ దిగిపోయిందంటే నమ్మండి. అతడి పేరు షమీందర్​ సింగ్​. పంజాబ్​లో ఉంటాడు. ఎన్టీఆర్​కు పిచ్చి ఫ్యాన్​. వృత్తి రీత్యా ఏరోనాటికల్​ ఇంజనీర్​ అయిన అతడికి ఫొటోగ్రఫీ అన్నా, మోడలింగ్​ అన్నా చాలా చాలా ఇష్టం. టిక్​టాక్​లో వీడియోలూ చేస్తుంటాడు. ఇప్పుడు ఎట్టిపరిస్థితుల్లో  ఎన్టీఆర్​ను కలిసి తీరాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఏదో ఒక రోజు తనను చూసి కలవకపోతాడా అని ట్విట్టర్​లో ఎన్టీఆర్​ను ట్యాగ్​ చేస్తూ వీడియోలు, అతడి డైలాగులను పోస్టు చేస్తున్నాడు. కానీ, హైదరాబాద్​ వస్తే ఎక్కడ ఎన్టీఆర్​ అనుకుని జనాలు చుట్టుముట్టేస్తారేమోనని టెన్షన్​ పడిపోతున్నాడు. ఈ మధ్యే టిక్​టాక్​లో ఓ వీడియో పెట్టాడు. ‘‘నా పేరు షమీందర్​ సింగ్​. నాకు ఎన్టీఆర్​ అంటే ఇష్టం. నాకు తెలుగు రాదు. తారక్​ను కలవాలనుకుంటున్నా. ఎన్టీఆర్​ అభిమానులు నన్ను చూసి మెసేజ్​లు కూడా చేస్తుంటారు. మీ అందరి కోసం మా పంజాబీ డాన్స్​ చేస్తా” అంటూ పెట్టాడు. మరి, అతడిని చూస్తే ఎన్టీఆర్​ ముఖ చిత్రం ఎలా ఉంటుందో!