“కమ్మ రాజ్యంలో కడప రెడ్లు” పై కోర్టులో మరో పిటిషన్‌

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కొత్త సినిమా “కమ్మ రాజ్యంలో కడప రెడ్లు” తెలంగాణ హైకోర్టు లో మరో పిటిషన్ దాఖలైంది. ఈ సినిమాలోని ఓ పాత్ర తనను అవమాన పరిచేలా ఉందని ప్రజాశాంతి పార్టీ నేత కేఏ పాల్ ఈ నెల 21 న ఓ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసింది. తాజాగా ఇంద్రసేనా చౌదరి అనే ఓ వ్యక్తి ఈ సినిమాపై మరో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ సినిమా వల్ల కమ్మ, రెడ్డి కులస్తుల మధ్య గొడవలు జరుగుతాయని,  సినిమా విడుదలను నిలిపివేయాలని తన పిటిషన్ లో పేర్కొన్నాడు. ఈ నెల 29న (శుక్రవారం) ఈ సినిమా విడుదలవనున్న క్రమంలో వెంటనే విచారణ జరపాలని  పిటిషనర్‌ తరపు లాయర్‌ బాలాజీ వదేరా తెలిపారు. దీనిపై హైకోర్టు నేడు విచారణ చేయనుంది.

ఈ సినిమా టీజర్, ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి పలు వివాదాలు చెలరేగుతూనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో.. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలకు మధ్య నెలకొన్న అంశాలను చూపిస్తున్నారు. గతంలో ఆర్జీవీ తీసిన లక్ష్మీస్ ఎన్టీఆర్ కూడా.. పలు వివాదాల మధ్య విడుదలై హిట్ టాక్ సొంతం చేసుకుంది.

Latest Updates