సిటీలో మరో దారుణం.. చెల్లిని బెదిరించి అక్కపై అత్యాచారం

దిశ ఘటన మరవకముందే హైదరాబాద్ లో మరో దారుణం జరిగింది. చెల్లిని బెదిరించి అక్కపై అత్యాచారం చేశాడో యువకుడు. ఈ నెల 8న  చాంద్రాయణగుట్ట పీఎస్ పరిధిలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హష్మబాద్ దగ్గర ఆటోకోసం చూస్తున్న అక్కచెల్లెలను జహంగీర్ దర్గాకు తీసుకెళ్తానని నమ్మించాడు ఆటో డ్రైవర్ అమీర్. దీంతో అమీర్ ఆటో ఎక్కారు ఆ అక్కాచెల్లెల్లు. అయితే సాయంత్రం టైమ్ లో వెళ్లడం సేఫ్ కాదని చెప్పిన అమీర్, తన ఇంటికి తీసుకెళ్లాడు. దీంతో కుబుంబసభ్యులు అమీర్ ను నిలదీయడంతో, నాంపల్లిలో దింపుతానని చెప్పి అమీర్ సోదరుడు మూసా టూవీర్ పై వారిని నాంపల్లిలోని ఓ హోటల్ కి తీసుకెళ్లాడు.  చెల్లెలిని చంపుతానని చెప్పి అక్కపై అత్యాచారం చేశాడు. తర్వాత వారిని ఉప్పుగూడా రైల్వే  స్టేషన్ లో వదిలి వెళ్లాడు.

8వ తేదీన అక్కచెల్లెల్లు కనిపించడం లేదని కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కాచెల్లెలను స్టేషన్ లో గుర్తించిన రైల్వే పోలీసులు చంద్రయాణ గుట్ట పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఎంక్వైరీ చేయగా మూసా అత్యాచారం చేసినట్లు చెప్పారు. కేసు నమోదు చేసుకున్న పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. అయితే నిందితుడు హోటల్ లో ఫేక్ ఐడీ కార్డు ఇచ్చినట్లు తెలుస్తోంది.

More News

ఆడ, మగ అంగీకారంతోనే రేప్‌లు: పోలీస్ వివాదాస్పద వ్యాఖ్యలు
9 గంటల నిద్ర చాలా డేంజరే!
ప్రతిభగల విద్యార్థులకు ఎల్ఐసీ అందిస్తున్న ఆర్థిక సాయం

Latest Updates