కోహ్లీ ఖాతాలో మరో రికార్డు

పరుగుల వీరుడు, కెప్టెన్ విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు చేరింది. కెప్టెన్‌గా టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా కోహ్లీ రికార్డు నమోదు చేశాడు. ఇప్పటి వరకూ ఈ రికార్డు ఎంఎస్ ధోని పేరు మీద ఉంది. ధోని 72 మ్యాచ్‌లలో 1112 పరుగులు చేయగా.. కోహ్లీ 36 మ్యాచ్‌లలో 1126 పరుగులు చేసి ఈ ఫీట్‌ను అధిగమించాడు. ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న టీంఇండియా మూడో టీ20 ఆడుతుంది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ 27 బంతులలో 38 పరుగులు చేసి ధోని రికార్డును బద్దలు కోట్టాడు. ఈ లిస్టులో సౌతాఫ్రికా ఆటగాడు డూప్లిసెస్ 40 మ్యాచ్‌లలో 1273 పరుగులు చేసి మొదటిస్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత న్యూజిలాండ్ ఆటగాడు కేన్ విలియమ్సన్ 41 మ్యాచ్‌లలో 1148 పరుగులు చేసి రెండో స్థానంలో ఉన్నాడు. వీరిద్దరి తర్వాతా కోహ్లీ మూడోవాడిగా తన పేరును నమోదు చేసుకున్నాడు.

For More News..

నిర్భయ దోషుల ఉరి అమలుకు లైన్ క్లీయర్

వైరల్ వీడియో: జింకను గన్‌తో కాల్చి.. కత్తితో గొంతు కోసిన వ్యక్తి

బీజేపీలోకి బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్

Latest Updates