సంగారెడ్డి జిల్లాలో ఆర్టీసీ కండక్టర్ మృతి

సంగారెడ్డి జిల్లాలో ఆర్టీసీ కండక్టర్ నగేష్ మృతి చెందాడు. అందోల్ మండలం జోగిపేటకు చెందిన నగేశ్ నారాయణఖేడ్ డిపోలో కండక్టర్ గా పనిచేస్తున్నాడు. నవంబర్ 5 న  కేసీఆర్ డెడ్ లైన్ వార్త విని అస్వస్థకు గురయ్యాడు. అప్పటి నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నగేశ్ ఇవాళ మృతి చెందాడు.

మరో వైపు నగేశ్ మృతదేహాన్ని నారాయణ ఖేడ్ డిపోకు తీసుకెళ్లేందుకు కార్మికులు  ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో జోగిపేటలో ఉద్రిక్తత నెలకొంది. నగేశ్ మృత దేహాన్ని అతని స్వగ్రామం పాపన్నపేటకు తీసుకెళ్లాలంటున్నారు పోలీసులు.

Latest Updates