కుందూరు జానారెడ్డికి మరో షాక్

నల్గొండ: కాంగ్రెస్ పార్టీ భీష్మాచార్యుడు కుందూరు జానారెడ్డికి మరో షాక్ తగిలింది. ఆయన ప్రధాన అనుచరుడు డాక్టర్ రవి కుమార్ నాయక్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. మీడియా సమావేశం పెట్టి మరీ రాజీనామా ప్రకటన చేశారు. కాంగ్రెస్ పార్టీలో కుటుంబ పాలన నడుస్తోందని  ఈసందర్భంగా డా.రవి కుమార్ నాయక్ దుమ్మెత్తిపోశారు. కేంద్రంలో సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మాదిరిగా నాగార్జున సాగర్ లో కూడా జానారెడ్డి కుటుంబ పాలన కొనసాగిస్తున్నాడని ఏకంగా జానారెడ్డిపైనే ధ్వజమెత్తడం కలకలం రేపింది. జానారెడ్డి కోసం నా ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేస్తే.. జానారెడ్డి వారసత్వ రాజకీయాలను ప్రోత్సాహిస్తున్నాడని ఆరోపించారు. బీజేపీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితుణ్ణి అయి ఆ పార్టీ లో చేరుతున్నానని… నాగార్జునసాగర్ నియోజక వర్గం నుండి గిరిజన గొంతు ను వినిపిస్తానని ఈ సందర్భంగా రవికుమార్ నాయక్ ప్రకటించారు.

ఇవి కూడా చదవండి..

వైరల్ వీడియో: దేన్ని ముట్టుకున్నా శానిటైజ్ చేసుకుంటున్న చిన్నారి

షాకింగ్ సర్వే: అమ్మాయిలు ఫోన్‌‌లు ఎంతసేపు వాడుతున్నారో తెలుసా?

తక్కువ ఖర్చుతో ఇల్లు కట్టడానికి 6 ఉపాయాలు

Latest Updates