ఇంగ్లండ్‌కు మరో ఆరుగురు పాక్‌ క్రికెటర్లు

కరాచీ: పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్‌ మహమ్మద్ హఫీజ్‌ సహా ఆరుగురు ప్లేయర్లకు ఊరట లభించింది. వీరికి నిర్వహించిన కరోనా టెస్టుల్లో నెగెటివ్‌ రిజల్ట్‌‌‌‌ వచ్చింది. దాంతో, ఈ ఆరుగురిని ఇప్పటికే ఇంగ్లండ్‌ చేరిన పాక్‌ టీమ్‌ తో కలిసేందుకు అనుమతిస్తున్నట్టు పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) మంగళవారం ప్రకటించింది. ఈ లిస్ట్‌‌‌‌లో హఫీజ్‌ తోపాటు ఫఖర్ జమాన్‌, మహమ్మద్‌‌‌‌ హస్నైన్ , మహమ్మద్ రిజ్వాన్, షాదాబ్‌ ఖాక్, వాహబ్‌ రియాజ్‌ ఉన్నారు. మూడు రోజుల వ్యవధిలో వీరికి రెండుసార్లు టెస్టులు చేయగా కరోనా లేనట్టు తేలింది. మరో నలుగురు ప్లేయర్లు.. కషీఫ్భాటి, హారిస్‌‌‌‌ రౌఫ్, హైదర్ అలీ, ఇమ్రాన్‌ ఖాన్‌కు రెండు సార్లూ పాజిటివ్‌ వచ్చింది. ఇంగ్లండ్‌ టూర్‌కు బయలుదేరే ముందు పాక్‌ ప్లేయర్లందరికీ పరీక్షలు చేయగా… పది మందికి వైరస్‌‌‌‌ సోకినట్టు తేలింది. వీరిని మినహాయించి మిగిలిన ప్లేయర్లను పాక్‌ బోర్డు ఇంగ్లండ్ పంపించింది. మాంచెస్టర్‌ కు చేరుకున్న ఫస్ట్‌‌‌‌ బ్యాచ్‌ ప్లేయర్లకు ఆదివారం కరోనా టెస్టులు చేయగా అందరికీ నెగెటివ్‌ వచ్చినట్లు ఈసీబీ మంగళవారం వెల్లడించింది. దీంతోపాటు ఇంగ్లం డ్‌ టీమ్‌ కు నిర్వహించిన మూడో దఫా టెస్ట్‌‌‌‌ల్లో కూడా అందరికీ నెగెటివ్‌ రిజల్ట్‌‌‌‌ వచ్చిందని పేర్కొంది. ఈటూర్‌లో ఇంగ్లండ్‌ తో పాక్‌ మూడు టెస్టులు, 3 టీ20లు ఆడనుంది.

Latest Updates